No Headline
బోయపాలేనికి చెందిన తన్నీరు నాగరాజుతో మాట్లాడగా... ‘నేను క్వారీ కార్మికుడిని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే మా జీవితం. ఏడేళ్ల కిందట ప్రమాదవ శాత్తు నా ఎడమ చేయి పూర్తిగా విరిగిపోవండతో పనిలో నుంచి తీసేశారు. కుటుంబం గురించి చాలా బాధ పడ్డా. కనీసం పెన్షన్ వస్తే కొంత ఆర్థిక సాయంగా ఉంటుందని భావించా. కాని దివ్యాంగ ధ్రువీకరణ పత్రం గాని, పెన్షన్ గాని టీడీపీ ప్రభుత్వంలో రాలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి సిఫార్సు లేకుండా పెన్షన్ మంజూరైంది. ఇందుకు వలంటీర్ వచ్చి స్వయంగా రాసుకుని వెళ్లాడు. ప్రతి నెలా ఒకటోతేదీన దివ్యాంగ పింఛను ఇంటికే తెచ్చి ఇస్తున్నాడు. పెన్షన్ నగదు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటోంది. పేద కుటుంబాలకు పెద్ద సాయం అక్కర్లేదు. మా కోరికలు, సమస్యలు కూడా చిన్నచిన్నవే అవి తీర్చిన వారే మాకు దేవుడితో సమానం.’ అని భావోద్వేగమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment