తెనాలిలోని నిమ్మ మార్కెట్లో వేలం ప్రక్రియ
రైతుకు రూపాయే!
కాయ కొనాలంటే రూ.ఆరుపైమాటే
మధ్య దళారులదే రాజ్యం
తెనాలి: అటు నిమ్మ రైతులతో ఇటు వినియోగదారులతో దళారులు చదరంగం ఆడుతున్నారు. లాభాలు మూటగట్టుకుంటున్నారు. నిమ్మ మార్కెట్‌కు కేంద్రమైన గుంటూరు జిల్లా తెనాలిలో రిటైల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పులుపు, తీపి కలగలసిన నిమ్మ షర్బత్‌ను రుచి చూసేవారికి ఇప్పుడు నిమ్మకాయల ధర వింటే నోరు చేదెక్కుతోంది. దసరా పర్వదిన రోజుల్లో మార్కెట్లో డజను రూ.100 పలికిన నిమ్మకాయలు ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. ఒక్కో నిమ్మకాయ రూ.5–6 పైమాటే పలుకుతోంది. నిమ్మతోటల రైతులకు స్థానిక మార్కెట్లో కిలో సగటు ధర రూ.26 పడుతోంది. అంటే కాయ కేవలం రూపాయి పడుతోంది. ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్న నానుడి చందంగా నిమ్మ మార్కెట్ పరిస్థితి నెలకొంది.
గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో గూడూరు, ఏలూరు తర్వాత నిమ్మ మార్కెట్‌కు తెనాలి ప్రసిద్ధి అని తెలిసిందే. గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతుంటే, అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజన్‌లోనే ఉంది. అందుకే ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రత్యేకంగా నిమ్మ మార్కెట్ నడుస్తోంది. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు నిమ్మకాయలను ఎగుమతి చేస్తుంటారు. నిమ్మ వ్యాపారానికి కేంద్రమైన తెనాలిలో ఏడాదిగా రైతులకు మార్కెట్ యార్డులో మంచి ధర లభిస్తోంది. రకరకాల కారణాలతో నిమ్మకాయల ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నిమ్మకాయల ధర తగ్గింది. గురువారం స్థానిక మార్కెట్‌లో నాణ్యమైన నిమ్మ కిలో రూ.30కు అమ్ముడుపోగా, కనిష్ట ధర రూ.20 చొప్పున కొనుగోళ్లు జరిగాయి. సగటు ధర రూ.26గా ఉంది. కాయ సైజు ప్రకారం ఒక్కో కిలోకు 20–25 కాయలు తూగుతాయి. అంటే ఒక్కో కాయకు రైతుకు రూపాయి లోపు ధర దక్కుతోంది. తోటల్లో నిమ్మకాయల కోత, రవాణా, మార్కెట్ యార్డు ఖర్చులతో లెక్కేసుకుంటే కాయకు 50–60 పైసలకు మించటం లేదని రైతులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా..!
నిమ్మ వినిమయం ఎంతగా పెరిగినప్పటికీ మార్కెట్లో రైతుకు పడే ధరకు, వినియోగదారుడి కొనుగోలు ధరకు మధ్య రూ.4–5 వ్యత్యాసం ఉండటం గతంలో ఎన్నడూ లేదు. కొద్దినెలల క్రితం వరకు బహిరంగ మార్కెట్లో రూ.10లకు డజను పైనే ఇచ్చేవారు. నిమ్మతోటను జాగ్రత్తగా చూసుకుంటూ నీరు పెడుతూ ఎరువులు వేస్తూ, తెగుళ్లకు మందులు వాడుతున్న రైతులకు దక్కుతున్న ధర అతి స్వల్పమైతే, బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న ధర ఏడెనిమిది రెట్లు అధికంగా ఉంటోంది.
మార్కెట్లో డిమాండ్ అధికం
బహిరంగ మార్కెట్లో నిమ్మకాయలకు డిమాండ్ విపరీతంగా ఉంది. డజను రూ.60–80కు అమ్ముతున్నారు. ఒక్కో కాయ ఐదారు రూపాయల పైమాటగానే ఉంది. రైతులు అమ్మేది తాజా పచ్చి నిమ్మకాయలైతే, మార్కెట్లో దొరికేవి పండిన పసుపు రంగులో ఉంటున్నాయని తెలిసిందే. కరోనా రోజుల నుంచి నిమ్మకాయ వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. రోగ నిరోధ శక్తి కోసమని, బరువు తగ్గేందుకని చాలామంది రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారు. కూరల్లో వాడే గృహిణులూ ఉన్నారు. బిర్యానీలు వంటి నాన్‌వెజ్ వంటకాల్లో నిమ్మరసం అనుపానం తప్పనిసరైంది. ఎండ తీవ్రతకు నిమ్మ షర్బత్‌ను తీసుకునేవారు ఎందరో ఉన్నారు.
దర్యాప్తు ‘సాగు..తోందంట’!
రూ.1,800 కనిష్ట ధర
రూ.2,700 గరిష్ట ధర
రూ.2,300 మోడల్ ధర
Comments
Please login to add a commentAdd a comment