బీమా సంస్థ ఉద్యోగిపై కత్తితో దాడి
లక్ష్మీపురం: బీమా కంపెనీ ఆపరేషన్ మేనేజర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అరండల్‌పేట 7/1 అడ్డరోడ్డులోగల కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మంగళవారం ఉదయం పెదకాకాని శివాలయం రోడ్డుకు చెందిన కందుల శ్రీనివాసరావు వచ్చారు. ఆపరేషన్స్ మేనేజర్ పులిగడ్డ రాజేష్‌ను కలిసి బీమా పాలసీలో నామినీ పేరు తప్పుగా పడిందని చెప్పారు. పేరు సరి చేసేందుకు సుమారు 10 రోజులు పడుతుందని రాజేష్ బదులిచ్చారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి రాజేష్‌తో గొడవ పడ్డారు. కంప్యూటర్, లాప్‌టాప్, ఫర్నిచర్ ధ్వంసం చేసి రాజేష్‌పై కత్తితో దాడి చేశాడు. దీన్ని గమనించిన తొటి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అరండల్‌పేట సీఐ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్ళహరి శ్రీనివాసరావు, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కత్తి చేతిలో పట్టుకున్న నిందితుడు అరగంట సేపు హల్‌చల్ చేశాడు. రాజేష్‌ను బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన పోలీసులను కూడా నిందితుడు బెదిరించాడు. ఎస్‌బీ సీఐ ఆళ్ళహరి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ రైటర్ సుబ్రమణ్యంలకు చిన్నపాటి గాయం అయింది. అయినా వెనక్కి తగ్గకుండా నిందితుణ్ని అదుపులో తీసుకుని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన రాజేష్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కంపెనీ మేనేజర్ సింగంశెట్టి గోపి దీనిపై అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేవారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నామినీ పేరు మార్పులో జాప్యమే కారణం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment