● జీవితమే ఒక దీపావళి
నిశీధిని పారదోలి మనందరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి. అందుకే ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ చీకట్లని పారదోలుకుని మార్పులు తెచ్చుకుని గొప్పదైన జీవితాన్ని నిర్మించుకోవాలన్నదే ఈ పండుగ సారాంశం. అందుకే చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ అంటూ పండుగను జనజీవితాలకు అన్వయం చేసి చెబుతారు. చిన్నా–పెద్దా తారతమ్యం లేకుండా ఆస్వాదించే పండుగ. నరకాసుర వధతో ఆరంభమయ్యే ఈ పర్వదినం రెండు రోజులపాటు తెలుగు లోగిళ్లలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పిల్లలు టపాసుల కొనుగోళ్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఖరీదుపెట్టి టపాసులు కొన్నా సీమ టపాకాయలు ఎర్రగా నాజూగ్గా ఉన్నానని బడాయికి పోతాయి. నీటుగా దీటుగా ఉన్నానని ఔటు గర్వానికి పోతుంది. బలంగా, ఒంపుగా
ఉన్నాననుకుంటుంది ఆటంబాబు. కానీ వీటన్నిటికీ తెలియదు ఈ దీపావళి నాడు తామంతా ఒక చిన్న అగ్గిపుల్లకు బానిసలమై పోతామని. దీపావళి సందర్భంగా
గుంటూరులో బాణసంచా దుకాణాలు భారీగా కొలువుదీరాయి.
– ఫొటోలు, సాక్షి, ఫొటోగ్రాఫర్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment