చిట్టీ నిర్వాహకురాలి మోసం
ఇరవై ఏళ్లుగా ఓ మహిళ రూ.2 లక్షల నుంచి రూ.ఐదులక్షల వరకు చిట్టీలు వేసేది. నమ్మకంగా ఉండడంతోపాటు అధిక వడ్డీలు ఆశ చూపడంతో డబ్బులిచ్చాం. చిట్టీ పాటలు ముగిసినా నగదు, వడ్డీలు చెల్లించ లేదు. ఆమె ఫోన్ పనిచేయడం లేదు. ఇంటికెళ్తే రెండు నెలలు క్రితమే వెళ్లిపోయినట్లు తెలిసింది. కుమార్తె పెళ్లి నిమిత్తమని, ఇతర భవిష్యత్తు అవసరాలకు పనికొస్తాయని ఆమెకు డబ్బులిచ్చాం. ఒక్కొక్కరికి ఆమె చిట్టీ, వడ్డీ రూపేణా రూ.ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పైగా ఇవ్వాలి. చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చింది. వాటి వల్ల ప్రయోజనంలేదు. న్యాయం చేయండి సార్.
– కోట పద్మ, ఆర్.అంజలి, షేక్.నాగుల్‌మీరా,
ఎ.పద్మ, పి.గిరిజారాణి తదితరులు నల్లచెరువు
అప్పు తిరిగి ఇవ్వడం లేదు
వృద్ధాప్యం పైబడటంతో కుమార్తె వద్ద ఉంటున్నా. రెండేళ్ల క్రితం ఇంటి వద్ద తెలిసిన ఆమెకు రూ.40 వేలు ఇచ్చాను. ఆర్థిక పరిస్థితి సరిగాలేదని డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగాను. ఆమె నుంచి సరైన సమాధానం లేదు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతోంది. న్యాయం చేయగలరు.
– కె.కోటమ్మ, ఏటీఅగ్రహారం, 10వ వీధి, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment