మోసపోయా‘మనీ’ ఆవేదన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): చిట్టీలు కట్టి, అప్పులు ఇచ్చి, ప్లాట్లు కొని మోసపోయామనీ పలువురు ఎస్పీ సతీష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదిదారుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులను ఆదేశించారు. ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు సుబ్బారావు (మహిళా పీఎస్), శివాజీరాజు (సీసీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment