నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం బాలల హక్కులపై వాల్ పోస్టర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న చాచా నెహ్రూ సిద్ధాంతం ప్రకారం బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. బాధిత బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచాలని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు లేని సమాజం కోసం పాటుపడాలని చెప్పారు. సంస్థ కార్యదర్శి టి.లీలావతి, కార్మికశాఖ డీసీ గాయత్రీదేవి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సి.హెచ్.విజయ్‌కుమార్, క్రాఫ్ సంస్థ సమన్వయకర్త కె.సమీర్, వెంకయ్య, టాస్క్‌ఫోర్స్ సభ్యులు, కార్మికశాఖ సహాయ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పారా లీగల్ వలంటీర్స్, ప్యానెల్ లాయర్స్ పాల్గొన్నారు. మల్లికార్జునపేటలోని సెయింట్ ఆన్స్ మనో వికాస కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి సందర్శించారు. బాలలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై ఆమె ఆరాతీశారు. జీజీహెచ్ వైద్యులతో పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ హైడా, జీజీహెచ్ వైద్యులు ఉషలతా, జయకృష్ణ. రవీంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి
Comments
Please login to add a commentAdd a comment