చిలకలూరిపేట: సినీనటి శ్రీరెడ్డిపై తెలుగు మహిళా విభాగం నాయకులు చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో పోస్టింగులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జరీనా సుల్తానా, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అమరా రమాదేవి, ప్రధాన కార్యదర్శి పోపూరి లక్ష్మి తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. వారు పట్టణ ఎస్ఐ డి చెన్నకేశవులను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ చెన్నకేశవులను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment