మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన
నగరంపాలెం: గుంటూరు, ప్రకాశం జిల్లాలోని న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై జిల్లా కోర్టు ఆవరణలోని హాల్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఈ క్రమంలో ది గుంటూరు బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ నుంచి ఆర్.రత్నతార, సత్యరావు (తమిళనాడు)లు మాట్లాడారు. రానున్న రోజుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారమయ్యేందుకు తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మధ్యవర్తిత్వం, రాజీ, లోక్ అదాలత్ అనేవి వేర్వేరు అని పేర్కొన్నారు. అనంతరం న్యాయవాదులు అడిగిన సందేహాలను వారు నివృత్తి చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి, సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) టి.లీలావతి ప్రసంగించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజోన్నల బ్రహ్మారెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనూరాధ, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment