ఉత్సాహంగా ఖో ఖో పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని ఖో ఖో పురుషుల అంతర కళాశాలల పోటీలను శనివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విద్యానిధి కమిటీ అధ్యక్షుడు పొట్టి సుబ్రహ్మణ్యం, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ సత్యపాల్ కుమార్ నూతన ఖో ఖో, హ్యాండ్ బాల్, లాంగ్ జంప్ ట్రాక్స్, కోర్టులను ప్రారంభించారు. పొట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక వికాసానికి క్రీడలు ముఖ్యమని చెప్పారు. ఇలాంటి అవకాశాలను క్రీడాకారులు వినియోగించుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆచార్య సత్యపాల్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సైతం ఉన్నాయని చెప్పారు. పోటీలకు టీజేపీఎస్ కళాశాల, ఏఎన్‌యూ వ్యాయామ విద్య కళాశాల, ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, విజ్ఞాన్ డిగ్రీ కళాశాల, నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల, ఏఎం రెడ్డి కళాశాల, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, విక్టరీ డిగ్రీ కళాశాల, డీసీఆర్‌ఎం డిగ్రీ కళాశాల, గుంటూరులోని సిమ్స్ కళాశాల, కేవీడీసీ కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. విక్టరీ, డీసీఆర్‌ఎం, వాగ్దేవి, కృష్ణవేణి కళాశాలల జట్లు లీగ్‌లోకి ప్రవేశించాయి. ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్స్ ఉంటాయి. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, కోశాధికారి వి.కృష్ణానంద్, శాప్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, డీఎస్‌డీవో పి. నరసింహారెడ్డి, ఏజీకేఎం డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డి. కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా ఖో ఖో అధ్యక్షుడు వి. వీరభద్రా రెడ్డి, కళాశాల వ్యాయామ అధ్యాపకుడు ఆర్. శివాజీ, డిగ్రీ ఇన్‌చార్జ్ భాను మురళీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
తలపడిన అంతర కళాశాలల క్రీడాకారులు
లీగ్‌లోకి ప్రవేశించిన నాలుగు జట్లు
Comments
Please login to add a commentAdd a comment