కానిస్టేబుల్ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు
నగరంపాలెం: స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం కొనసాగాయి. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మైదానానికి చేరుకుని వారికి పలు సూచనలు చేశారు. 383 మందిలో 77 మంది ధ్రువపత్రాలు తేకపోవడంతో వెనుదిరిగారు. మిగతా 306 మందికి శరీర కొలత పరీక్షలు నిర్వహించగా, 23 మందిని తిరస్కరించారు. మిగతా వారికి 1,600 మీటర్ల పరుగు పందెం జరగ్గా, 41 మందిని అనర్హులుగా ప్రకటించారు. 241 మందికి 100 మీటర్ల పరుగు పందెం పెట్టగా 147 మంది అర్హత సాధించారు. 242 మందికి లాంగ్ జంప్ నిర్వహిస్తే 236 మంది అర్హత సాధించారు. 306 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 238 మంది అర్హత సాధించారు. జిల్లా ఏఎస్పీలు ఏవీ రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్) పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment