నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చట్టానికి అతీతమైన వ్యక్తిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుడమేరు వరదల సమయంలో సాయం మాటున చేసిన అక్రమాలు, అవినీతికి కమిషనర్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ‘‘మూడేళ్లలో తాను రిటైర్డ్ అవుతాను.. అప్పటి వరకు నేను ఏమి చేసిన ఏమీ కాదు’’ అని కమిషనర్ భావిస్తే ఎక్కడ ఉన్నా.. చట్టం లాక్కొస్తుందని అంబటి హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో మేయర్‌ను భాగస్వామ్యం చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment