వేడుకగా గణతంత్ర దినం నిర్వహిద్దాం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈనె 26న గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ సతీష్ కుమార్, జేసీ భార్గవ్ తేజతో కలిసి ఆమె సమీక్షించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖజావలి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డ్వామా పీడీ శంకర్, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఈఓ రేణుక, డీఎస్‌ఓ కోమలి పద్మ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల
బ్రోచర్ ఆవిష్కరణ
కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల బ్రోచర్, కరపత్రాలు, బ్యానర్‌లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ ఎ.భార్గవ్ తేజ, ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి గురువారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య వారధులు మహిళా పోలీసులు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): క్షేత్రస్థాయిలో ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య మహిళా పోలీసులు వారధులని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. జిల్లాలోని గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసులు) జాబ్ చార్ట్ యాప్‌ను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని హాల్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాబ్ చార్ట్ యాప్‌తో జవాబుదారీతనం ఉంటుందని వివరించారు. ప్రజా సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో మహిళా పోలీసుల పాత్ర కీలకమని చెప్పారు. సమావేశంలో మహిళా పీఎస్ డీఎస్పీ సుబ్బారావు, ఐటీ విభాగం సీఐ నిస్సార్‌బాషా, హెచ్‌సీ కిషోర్, కానిస్టేబుళ్లు ఇమామ్‌సాహెబ్, మానస, యాసిన్ పాల్గొన్నారు.
కలెక్టర్ నాగలక్ష్మి
మహిళా పోలీసుల జాబ్ చార్ట్ యాప్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment