కమిషనర్ వ్యవహారిస్తున్న తీరు కౌన్సిల్‌ను అభాసుపాలు చేయాలని చూస్తున్నట్టు ఉందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ తరుఫున అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నామని వివరించారు. ఓ కమిషనర్, అధికారులు కౌన్సిల్ నుంచి వాకౌట్ చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. దీని వెనుక అధికారపార్టీ నాయకుల కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. వారి కుట్రలను తిప్పకొడతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment