ఏటీఎం మోడల్‌తో నిరంతర ఆదాయం
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చని డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. పట్టణంలోని పోస్టల్‌కాలనీలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేస్తున్న కోడూరి వెంకటేశ్వరరెడ్డి పొలాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు ఎకరాల్లో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు వెంకటేశ్వరరెడ్డి పండిస్తున్నట్టు తెలిపారు.
ఆకుకూరలు కట్ట రూ.10కే విక్రయిస్తున్నారని, వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మూడు అడుగుల వెడల్పుతో బెడ్స్ వేసుకొని వాటిలో అవసరం మేరకు విత్తే దశలో, పెరిగే దశలో, పాత దశలో ఉండే విధంగా తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీరతో పాటు టమాటాలు, గోరుచిక్కుడు, వంగ, మిరప, క్యాబేజీ, బెండలతో పాటు తీగజాతి కూరగాయలను పండిస్తున్నారని వివరించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment