తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత
మంగళగిరి (తాడేపల్లి రూరల్): ఉదయం తప్పిపోయిన బాలుడ్ని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో నివాసముంటున్న దంపతులకు మతిస్థిమితం లేని కుమారుడు (8) ఉన్నాడు. గురువారం ఉదయం నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెదికారు.
మంగళగిరి బస్టాండ్ ఎదురు రోడ్డులో ఓ గుర్తుతెలియని వాహనం సదరు బాలుడ్ని ఢీకొని వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ఉన్న కొంతమంది యువకులు ఆరా తీశారు. మతిస్థిమితం లేని బాలుడు ఏమీ మాట్లాడలేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. రెండు గంటల వ్యవధిలో బాలుడి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అక్కడ తమ కుమారుడిని చూసి విలపించారు. కుమారుడిని పోలీసులకు అప్పగించిన యువకులకు, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment