పురస్కారాలకు ఎంపికై న తెనాలి కవులు
తెనాలి: ప్రముఖ సాహితీ, సాంస్కతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఏటా బహూకరిస్తున్న తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారాలకు తెనాలి నుంచి నలుగురు సాహితీమూర్తులు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పొయెట్రీ అకాడమీ సంయుక్తంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన విజయవాడలో సాహిత్య సభలో పురస్కారాలను అందజేస్తారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఈ మేరకు సమాచారం పంపారు. పురస్కారాలను అందుకోనున్న వారిలో తెనాలికి చెందిన ప్రముఖ కవయిత్రి/తెలుగు ఉపాధ్యాయిని షేక్ అస్మతున్నీసా, రంగిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంగిశెట్టి రమేష్ (గంగాశ్రీ), సాహితీబంధువు ఆళ్ల నాగేశ్వరరావు (కమలశ్రీ), ప్రముఖ పద్యకవి డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిని పట్టణానికి చెందిన పలువురు రచయితలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment