తాడేపల్లి రూరల్ : దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ఏపీ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుగ్గిరాల గ్రామంలో ఆదివారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పరిహారం చెల్లించాలని అనే క ఉద్యమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.7 వేల నష్టపరిహారం ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వకపోవడంతో బాధిత రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందిచకపోతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
వేంకటేశ్వరమ్మకు జాతీయ పురస్కారం
అచ్చంపేట: గింజుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ అర్చక ఆధ్యాత్మిక పండితులు రెంటాల వేంకటేశ్వరశర్మ ఆర్వాణి సకల కళావేదిక, కరీంనగర్‌వారు జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన పురస్కార సభలో ఆర్వాణి సకల కళావేదిక ప్రతినిధి డాక్టర్ దూడపాక శ్రీధర్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. వేంకటేశ్వరశర్మ మాట్లాడుతూ తన తండ్రి సత్యనారాయణ ద్వారా అర్చక ఆధ్యాతిక జ్యోతిష్య రంగాన్ని వారసత్వంగా పొందానన్నారు. ఈ రంగాలలో తాన చేసిన కృషిని గుర్తించిన ఆర్వాణి సకల వేదిక ప్రముఖులు 2025 సంక్రాంతి జాతీయ ప్రతిభాపురస్కారానికి ఎంపిక చేశారన్నారు. వారి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహిత వేంకటేశ్వరశర్మను మాదిపా డు, గింజుపల్లి గ్రామా ల వైఎస్సార్ సీపీ ప్రముఖులు సర్పంచ్ మాదా ఈశ్వరమ్మ, వారి భర్త వెంకట్రావు, ఎంపీటీసీ భూక్యా స్వర్ణ మ్మ వారి భర్త రమేష్‌నాయక్, జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు దేవరశెట్టి శ్రీనివాసరావు, ఆర్‌యంపి వైద్యులు షేక్ కరీం, కొరివి వెంకటనరేష్, చిట్యాల దావీదు తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment