కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదుల నిరసన

Published Tue, Jan 21 2025 2:19 AM | Last Updated on Tue, Jan 21 2025 2:19 AM

కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదుల నిరసన

కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదుల నిరసన

గుంటూరు వెస్ట్‌: పొన్నూరు పోలీసులు దళిత న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ గుంటూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు సోమవారం కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేశారు. సుమారు వంద మందికిపైగా న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది శాంత కుమార్‌, కేకేలు మాట్లాడుతూ గత నెల 25న పొన్నూరులో న్యాయవాది బి.ప్రకాశరావు తన స్నేహితులకు చికిత్స ఎందుకు చేయడంలేదని వైద్యులను ప్రశ్నించినందుకు సీఐ రవి కిరణ్‌, ఎస్‌ఐ రాజ కుమార్‌, కానిస్టేబుళ్లు పోలీస్‌ స్టేషన్లో దారుణంగా కొట్టారన్నారు. ప్రకాశరావుకు తీవ్ర గాయాలయ్యాయని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల క్షేమం కోసం పనిచేయాల్సిన పోలీసులు రక్తం కారేట్లు ఓ న్యాయవాదిని కొట్టడం అన్యాయమన్నారు. ఇలా అయితే ప్రజలకు పోలీసులపై గౌరవం ఏముంటుందని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు వేములు ప్రసాద్‌, దేవరకొండ రోశయ్య, న్యాయవాదులు పొల్గొన్నారు.

న్యాయవాదిపై పొన్నూరు పోలీసుల దాడికి ఖండన కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతిపత్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement