జీజీహెచ్‌లో సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి అనుమతి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో నిర్మాణం ఆగిపోయి ఉన్న సర్వీస్ బ్లాక్‌ను పూర్తి చేసేందుకు గుంటూరుకు చెందిన తులసి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు, గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి సంఘం సభ్యుడు తులసి రామచంద్ర ప్రభు ముందుకు వచ్చారు. గతంలో ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు నిర్మాణం పూర్తి చేయకుండా నిలిపివేశారు. సుమారు రూ. 7.50 కోట్లతో భవన నిర్మాణం పూర్తి చేసేందుకు తులసి రామచంద్ర ప్రభు ముందుకు రావడంతో భవన నిర్మాణం చేపట్టేందుకు ఆయనకు అనుమతి ఇస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీస్ బ్లాక్ నిర్మాణం పూర్తయితే సెంట్రల్ కిచెన్, హాస్పటల్ స్టోర్స్, లాండ్రి, ఎంఆర్‌డీ విభాగం, సీఎస్‌ఎస్‌డీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. నాలుగు అంతస్తులతో భవన నిర్మాణం జరుగనుంది. ఉత్తర్వుల కార్యారూపణకు కృషి చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్‌లకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment