వైఎస్సార్ సీపీ నేతల భూములే లక్ష్యం
మేడికొండూరు: అధికారపార్టీ నాయకుల దాష్టీకాలకు అంతేలేకుండా పోతోంది. వైఎస్సార్ సీపీ నాయకుల భూముల ఆక్రమణే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అధికారుల సహకారంతో వేధింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్‌లో ఎస్సీ వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీపీ మన్నవ స్వప్న రాజేష్ కుటుంబ సభ్యులకు సర్వే నంబర్ 435 /ఏలో 2.10 ఎకరాల పట్టా భూమి ఉంది. అది ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో రాకపోకలకు వినియోగిస్తున్నారు. దీనిని ఆక్రమించేందుకు అధికారపార్టీ నేతలు యత్నిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లే మార్గం లేకపోయినా అక్కడే మరుగుదొడ్లు నిర్మాణం చేయాలంటూ అధికారులతో కలిసి వేధింపులకు దిగుతున్నారు. ఎటువంటి నోటీసులూ జారీ చేయకుండా గ్రామపంచాయతీ అధికారులు గురువారం ప్రభుత్వ భూమి అంటూ జేసీబీలు, పోలీసుల సాయంతో దౌర్జన్యానికి దిగారు. స్థలంలో ఉన్న కంచెను తొలగించారు. తమకు బయటకు వెళ్లే మార్గం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.
పత్తా లేని తహసీల్దార్
పేరేచర్లలో టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై వినతిపత్రం అందించేందుకు ఎంపీపీ మన్నవ స్వప్న రాజేష్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. కార్యాలయ సిబ్బందిని అడగ్గా తమకు తెలియదంటూ సమాధానమిచ్చారు. ఫోన్ చేసినా తహసీల్దార్ స్పందించలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన తహసీల్దార్ తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.
పట్టా భూముల్లోనూ అధికారపార్టీ
నేతల దాష్టీకం
అధికారుల సహకారంతో వేధింపులు
ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment