No Headline
తెనాలి: వైకుంఠపురం లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయ, ధర్మదాయశాఖ తనిఖీదారు ఎస్.శారదాదేవి సమక్షంలో మూడునెలల కాలపరిమితికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీల లెక్కింపు జరిపారు. రూ.52,45,169 నగదు, అన్నదానం హుండీలో రూ.90,560 నగదు, 81.40 గ్రాముల బంగారం, 560.440 గ్రాముల వెండి వచ్చాయి. వీటితోపాటు అమెరికన్ డాలర్లు 15, ఆస్ట్రేలియా డాలర్లు 20, యూకే ఫౌండ్లు ఐదు, నేపాల్ రూ.5, జాంబియా 50 క్వాచ్చా, ఖతార్‌కు చెందిన రియాల్స్ ఐదు, ఇరాన్ కరెన్సీ 200 రియాల్స్‌ను భక్తులు సమర్పించారు. వీటితోపాటు చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 122 కూడా స్వామి హుండీల్లో ఉన్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు కురగంటి సునీత, బొద్దులూరి సరస్వతి, మావులూరి శ్రీనివాస్, ముంతా ప్రసాద్, బట్టు దుర్గారావు, దేవరకొండ వెంకటరమణ, ఎక్స్‌అఫీషియో మెంబర్ అళహరి రవికుమార్, దేవస్థానం సిబ్బంది, ఎపీసీఓబీ బ్యాంకు, చెంచుపేట సిబ్బంది, భారత్ స్కౌట్స్, గైడ్స్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment