ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్‌పై టీడీపీ నేతల నిరసన
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ నసీర్‌అహ్మద్‌కు సొంత పార్టీ టీడీపీ నేతల నుంచే నిరసన వ్యక్తమైంది. తమకు విలువనివ్వడం లేదని, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎండీ నసీర్‌అహ్మద్ గురువారం 1వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో సుభాష్‌చంద్రబోస్ జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఫిరోజ్, అతని సోదరుడు ఇంతియాజ్ మరో నలుగురితో కలిసి అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను నిలదీశారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డివిజన్‌లోకి రావటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నసీర్ తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో మరోమారు వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో నేతలు పరస్పరం దుర్భాషలాడుకున్నారు. కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపివేశారు.
టీడీపీ నేతలపై కేసు నమోదు
ఇదిలా ఉంటే కార్యక్రమాన్ని నిర్వహించిన మొవ్వ శైలజను టీడీపీ 1వ డివిజన్ అధ్యక్షుడు ఫిరోజ్ అతని సోదరుడు ఇంతియాజ్ బెదిరించారు. ఆమెను దుర్భాషలాడారు. దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విలువనివ్వలేదంటూ మండిపాటు
దాడికి కార్యకర్తల యత్నం
ఎమ్మెల్యేను పంపేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment