కుల, మతాలకతీతంగా ఉండే నాయకులే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి. మానుకోటలో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పోరాడాం. అవి నేటికీ మంజురు కాలేదు. విద్యాభివృద్ధికి తోడ్పడే నాయకుడినే మానుకోటలో గెలిపిస్తాం.
– రవీందర్, ప్రభుత్వ అధ్యాపకుడు, మానుకోట
పల్లెల్లో అభివృద్ధి జరగాలి
గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన దేశ ప్రగతి. 2016లో మానుకోట జిల్లాగా ఆవిర్భవించింది. రూ. కోట్లు వృథా చేశారే తప్ప జిల్లాలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. అందుకే అభివృద్ధికి కృషి చేసే నాయకుడినే ప్రజలు ఈ ఎన్నికల్లో గెలిపించాలి.
– మైస శ్రీనివాసులు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, మానుకోట
ఎన్నికల ఖర్చు ఎక్కువ
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత దేశంలోనే ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించుకోవడానికే నాయకులు ఆరాటపడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు, అభివృద్ధి గురించి ఆలోచించిడం లేదు. అందుకే మానుకోట ప్రజలు మంచి నాయకుడికే పట్టం కట్టాలి.
– సోమన్న, కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment