అర్జీలు పరిష్కరించి నమ్మకం పెంచండి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాళోజీ సెంటర్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో 95 దరఖాస్తులు రాగా.. సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. 45 దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో రెవెన్యూ శాఖకు చెందినవి కాగా.. 10 కలెక్టరేట్‌కు సంబంధించినవి, 6 జిల్లా ఉపాధి శాఖ, మిగతా 34 దరఖాస్తులు వివిధ శాఖలకు చెందినవి ఉన్నాయి. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్ఓ మాడమూషి విజయలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment