పోలీస్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలి
మడికొండ: పోలీస్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా ప్రజలకు సేవ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా పిలుపునిచ్చారు. కాజీపేట మండలం మడికొండ శివారులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 246 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (సివిల్) పాసింగ్ అవుట్ పరేడ్(దీక్షాంత్ పరేడ్) గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీటీసీ ప్రిన్సిపాల్ ఎన్. రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంబర్‌కిశోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందు ట్రైనింగ్ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సమాజంలో ప్రత్యేక్షంగా సేవలందించేది పోలీసులు మాత్రమేనన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రలోభాలకు లొంగకుండా నీతి, నిజాయతీతో విధులు నిర్వహించే పోలీసులకు సమాజంలో గౌరవం పెరగడంతో పాటు, అధికారుల గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్, సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ రమణబాబు, ఏసీపీలు తిరుమల్, సురేంద్ర, అనంతయ్య, ఆర్‌ఐ ఉదయభాస్కర్, శ్రీనివాస్, శ్రీధర్, స్పర్జన్‌రాజ్, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, మంగీలాల్, కిషన్, ఎస్సై రాజబాబు, తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
నాన్నను ఆదర్శంగా తీసుకున్న
మాది వనపర్తి జిల్లా. నేను బీటెక్ పూర్తి చేశా. మా నాన్న నిరంజన్ పోలీసు డిపార్టుమెంట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మానాన్నను ఆదర్శంగా తీసుకుని మొదటి సారి ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ కాగా ఒక్క మార్కు తేడాతో చేజారింది. మరో ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినందు కు ఆనందంగా ఉంది. – ఎం.చైతన్యకుమార్, వనపర్తి
వరంగల్ పోలీస్ కమిషనర్
అంబర్ కిశోర్ ఝా
Comments
Please login to add a commentAdd a comment