వరంగల్ క్రైం: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, అతడి అనుచరులపై భూ ఆక్రమణ, దొంగతనం కింద సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి గురువారం తెలిపారు. ప్రశాంత్‌నగర్‌కు చెందిన రుద్రోజు పద్మావతి అలియాస్ జల్లిపల్లి పద్మావతి హంటర్‌రోడ్డులోని వినాయకనగర్ రోడ్డు నంర్ –1 లో గల దుర్గాదేవి కాలనీలో 500 గజాల భూమిని మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరుల అక్రమించారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 1985 లో పద్మావతి తండ్రి మారం వీరయ్య ఆమెకు పసు పు, కుంకుమల కింద ఈ భూమిని ఇచ్చి 2009లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో పాటు 2023లో గ్రేటర్ మున్సి పల్ కార్పొరేషన్ నుంచి ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొంది అ స్థలంలో కంటెయినర్ ఇల్లు నిర్మాణం చేసుకో గా కంటెయినర్‌తోపాటు అందులోని రూ.3 లక్షల విలువైన వస్తువులను శంకర్‌నాయక్‌తో పాటు అతని అనుచరులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. కంటెయినర్‌ను ఎతుకుపోవడంపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనుచరులపై గత ఏడాది కేసు నమోదు అయ్యిందని వివరించారు. ఇటీవల శంకర్‌నాయక్ అనుచరులు అజ్మీరా వెంకటనాయక్, బానోత్ ప్రేమ్‌నాయక్, బానోత్ మోహన్‌లాల్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులు బాధితురాలితోపాటు భర్త, కుమారుడిపై దాడి చేసి సెల్‌ఫోన్లను లాక్కున్నట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శంకర్‌నాయక్, అతడి అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
హనుమకొండ సుబేదారి పీఎస్‌లో
బాధితుల ఫిర్యాదు
ఆయనతోపాటు మరికొందరిపై నమోదు
Comments
Please login to add a commentAdd a comment