No Headline
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో భారీ బంగారం చోరీ కేసు విచారణను పోలీసులు అన్ని కోణాల్లో వేగం పెంచినా అనుకున్నంత పురో గతి కనిపించడం లేదు. సెక్యూరిటీ గది తలుపులు పగులగొట్టి మూడు సేఫ్ లాకర్లలో ఒకటైన బంగారు ఆభరణాలు ఉన్న లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసే క్రమంలో అంతర్జాతీయ ముఠా సభ్యుల్లో ఒకరి చేతి కాలినట్టుగా పోలీసులకు ఘటనాస్థలిలో అనవాళ్లు లభ్యమయ్యాయని తెలిసింది. ఈ మేరకు రాయపర్తి మండలంతోపాటు కొద్ది దూరంలో ఉన్న వర్ధన్నపేట, తొర్రూరు పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవే టు ఆస్పత్రుల్లో, మెడికల్ షాపుల్లో గురువారం తని ఖీలు చేశారు. గాయపడిన దొంగ ఎక్కడైనా చికిత్స పొందాడా, లేదా మందులు తీసుకున్నాడా అనే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంకోవైపు ఈ కేసు విచారణ కోసం ఏర్పాటుచేసిన నాలుగు ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఇదే తరహా దొంగతనం జరిగిన ఠాణాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమిళనాడుతోపాటు క ర్ణాటకలోనూ దొంగల కోసం గాలిస్తున్నట్లు తెలి సింది. 497 మంది ఖాతాదారులకు చెందిన 19 కిలోల బంగారం కావడంతో ఈ నేరస్తులను పట్టుకోవడం కోసం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటికే రాయపర్తి పోలీసుల నైట్ పెట్రోలింగ్ చేయకపోవడంతో పాటు బ్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడంపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి.
అలర్ట్...అలర్ట్..
రాయపర్తిలోని ఎస్‌బీఐలో భారీ చోరీ జరిగిన నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ పరిధుల్లో ఉండే బ్యాంక్‌లను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ప్రతి బ్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు, లాక్ సిస్టం, అలారం వంటి అంశాలతో తనిఖీ చేస్తూ సూచనలు చేశారు. అన్ని బ్యాంక్‌ల వారు తమ ప్రధాన కార్యాలయానికి ఇక్కడి సీసీటీవీ కెమెరాలను అనుసంధానించడం ద్వారా ఇక్కడ ఏమీ జరిగినా తెలిసిపోయేలా ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment