సమగ్ర సర్వేపై కమిషనర్ అసంతృప్తి
వరంగల్ అర్బన్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమై మూడు రోజులైనా ఆశించిన పురోగతి లేదని, ప్రతీ రోజు నగర వ్యాప్తంగా 20 వేల కుటుంబాల వివరాలు సేకరించి, నమోదు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్లు, ఇతర విభాగాల అ ధికారులతో సర్వేపై సమీక్షించారు. మూడు రో జులుగా కాజీపేట సర్కిల్ పరిఽధిలో 11,535 కాగా, కాశిబుగ్గ సర్కిల్‌లో 13వేలకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సర్కిల్‌వారీగా రోజుకు 10 వేల కుటుంబాల చొప్పున వివరాలు సేకరించాలని సూచించారు.
సర్వేపై సందేహాలు వద్దు: వరంగల్ కలెక్టర్
సర్వేపై పౌరులకు సందేహాలు అవసరం లేదని, వి వరాలు గోప్యంగా ఉంటాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం సాయంత్రం 24వ డి విజన్‌లోని పాటక్ మొహల్లా, ఎల్లంబజార్‌లో కొనసాగుతున్న సర్వే తీరునును ఆమె పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment