కాళోజీ సెంటర్: వరంగల్ మట్వాడ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కన్నం అరుణను జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్గా నియమిస్తూ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పనిచేసిన ఏసీ డీపీసీ నరసింహారావు అక్టోబర్ 31న పదవి విరమణ పొందినందున ఆయన స్థానంలో అరుణను నియమించారు. నియమిత పోస్టుకు ఎలాంటి అదనపు జీతం లేదా ఇతర చెల్లింపులు లేకుండా హెచ్ఎంగా ఏసీగా పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లాలో 59,948
గృహాల్లో సర్వే పూర్తి
వరంగల్: వరంగల్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కులగణన సర్వే కొనసాగుతోంది. మంగళవారం నాటికి ఎన్యుమరేటర్లు 59,948 (20.9శాతం) గృహాల్లో పూర్తి చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 36,593 గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 23,355 గృహాల్లో సర్వే పూర్తి అయినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment