అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక
వరంగల్ క్రైం: కేంద్ర ప్రభుత్వం అందజేసే అతి ఉత్కృష్ట సేవా పతకాలకు కేయూసీ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లారెడ్డి, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.మహేశ్ ఎంపికయ్యారు. అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై న దామెర మండలం కోగిలివాయి గ్రామానికి చెందిన మల్లారెడ్డి 1990లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. గూడూరు, కొత్తగూడ, సంగెం, సుబేదారి పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తూ జిల్లా అధికారుల నుంచి పలు రివార్డులు, ప్రశంసపత్రాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవ, ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. అలాగే, హనుమకొండ జిల్లా ఉప్పల్ కమలాపూర్ ప్రాంతానికి చెందిన మహేశ్ 1996లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. సీసీఎస్, మిల్స్‌కాలనీ, జనగామ పోలీస్‌స్టేషన్‌ల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి పోలీస్ అధికారుల నుంచి రివార్డులతోపాటు కలెక్టర్ నుంచి ప్రశంసపత్రం అందుకున్నారు. అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైన మల్లారెడ్డి, మహేశ్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
శబరిమలకు ఆర్టీసీ బస్సు
హన్మకొండ: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోందని ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ ఆర్‌ఎం మాధవరావు తెలిపారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌లో శబరిమల ప్రత్యేక బస్సు కరపత్రాలను డిపో మేనేజర్లతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్‌ఎం మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఆర్టీసీ బస్సు డిపోలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, అసిస్టెంట్ మేనేజర్ నాజియా సుల్తానా, సిబ్బంది మహమ్మద్ గౌస్ మొహినుద్దీన్, మహమ్మద్‌అలీ, కేవీ.రెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీసీ గిఫ్ట్ స్కీం
విజేతల ఎంపిక
హన్మకొండ: హనుమకొండ–హైదరాబాద్ రూట్‌లో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీం విజేతలను మంగళవారం ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌లో ప్రయాణికులతో డ్రా తీసి డిప్యూటీ ఆర్‌ఎం మాధవరావు విజేతలను ప్రకటించారు. ఎం.రమ (7981314836), చేతి లత (9652250322), ఎం.పద్మ (9014072550) విజేతలుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్‌ఎం మాట్లాడుతూ డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికులను ప్రోత్సహించడానికి గిఫ్ట్ స్కీం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు బస్సు దిగే ముందు టికెట్‌పై పేరు, ఫోన్ నంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని సూచించారు. ప్రతి 15 రోజులకు డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరంసింగ్, వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, నాజియా సుల్తానా పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు
పాటించాలి
కాజీపేట అర్బన్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించి, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీటీసీ (డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్) పుప్పాల శ్రీనివాస్ సూచించారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ట్రాఫిక్ రూల్స్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రహదారిపై ఏమరుపాటుతో డ్రైవింగ్ చేయకూడదని, రాంగ్ రూట్, సిగ్నల్ బ్రేక్ చేయొద్దని కోరారు. సదస్సులో బీసీ వెల్ఫేర్ డీడీ రాంరెడ్డి, రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ వేణుగోపాల్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవీ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment