ఉన్నతీకరణ పనులు పూర్తిచేయాలి
హన్మకొండ అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్నతీకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అంగన్‌వాడీల అభివృద్ధి పనులపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బోర్డులు బాగా కనిపించేలా, చిన్నా రులకు టాయిలెట్స్ సౌకర్యవంతంగా ఉంచాలని పేర్కొన్నారు. మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలన్నారు. పనులు పూర్తయిన వాటి బిల్లులను డీడబ్ల్యూఓకు సమర్పిస్తే వెంటనే పేమెంట్ చేస్తామని తెలిపారు. డీడబ్ల్యూఓ జయంతి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, టీజీడబ్ల్యూఐడీసీ డీఈ నరేందర్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు
ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించడంలో జాప్యం వద్దని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపు అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో 48 ఐకేపీ, 109 పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. 31 రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్ చేసినట్లు పేర్కొన్నారు. జియోట్యాగింగ్‌తో ధాన్యం అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లులకు తరలిస్తారని వివరించారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఏఈఓలు టోకెన్లు అందజేయాలన్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వారం రోజుల్లో పూర్తిచేయాలని మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీసీఎస్‌ఓ దేవరాయి కొమరయ్య, డీఏఓ రవీందర్‌సింగ్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఉప్పునూతుల మహేందర్, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ కేంద్రాల
అభివృద్ధిపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment