కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకోవాలి
వరంగల్ చౌరస్తా: నగరంలోని గోవిందరాజ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం గోవిందరాజుల గుడి ఆవరణలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వాల్ పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనంత కోటి దీపోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరయోగుల శ్రీనివాసస్వామి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల నవీన్ రాజ్, పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, నాయకులు ఆయూబ్, తోట హరీశ్, వశీం, దౌడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment