19న హనుమకొండకు సీఎం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ఈనెల 19వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళో జీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం బాలసముద్రంలోని ప్రజాభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళోజీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ స్వామిచరణ్, నాగరాజు, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, సంపత్ పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 56 లక్షలు
కాజీపేట అర్బన్: 31వ డివిజన్ పరిధి నందిహిల్స్ కాలనీలో 20 రోజుల్లోనే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.56 లక్షల నిధులు కేటాయించినట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. నందిహిల్స్ కాలనీలో సీసీరోడ్డు నిర్మాణానికి బుధవారం కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్లరాజు, నాయిని లక్ష్మారెడ్డి, కాలనీ అధ్యక్షుడు రావుల శ్రీధర్, సుబ్బరాజు, జగన్‌మెహన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, మల్లయ్య, మోహన్‌రావు, జనార్దన్‌రెడ్డి, దుర్గారావు, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
ప్రజాభవన్‌లో కాళోజీకి ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment