నాణ్యత పాటిస్తేనే బిల్లుల చెల్లింపు
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులను టెండర్ ఒప్పందాల మేరకు నాణ్యతతో చేపట్టాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని 57వ డివిజన్‌లో పూర్తయిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా కమిషనర్ డివిజన్‌లోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్మించిన అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నాణ్యత, రోడ్డు వెడల్పు, లోతు కొలతలు వేయించారు. నాణ్యతను ఎంబీ రికార్డ్ ప్రకారం పరిశీలించారు. నాణ్యత పాటించకపోతే బిల్లుల చెల్లింపులో కోత విధించనున్నట్లు, చేపట్టిన పనులు పది కాలాల పాటు నిలిచేలా కాంట్రాక్టర్లు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా ఇంజనీర్లు పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment