ఎస్‌వీఎస్‌లో మహిళా క్రికెట్ పోటీలు ప్రారంభం
హసన్‌పర్తి: నగరంలోని ఎస్‌వీఎస్ కళాశాలలో మహిళా క్రికెట్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్‌వీఎస్ విద్యాసంస్థల వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ విద్యార్థినులు క్రికెట్ ఆడడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల శారరీక దృఢత్వంతో పాటు మానసిక వికాసం చేకూరుతుందన్నారు. చదువుకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment