శిథిలావస్థలో కాకతీయ పైలాన్
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ సిద్ధార్థనగర్ – వడ్డేపల్లి రిజర్వాయర్ కట్టపై పుష్కర కాలం క్రితం ఆవిష్కరించిన కాకతీయ పైలాన్ శిథిలావస్థకు చేరింది. పర్యాటకులను ఆకర్శించడం కోసం సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో కట్టను అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో మున్సిపల్, కుడా అధికారులు 2012లో అప్పటి కేంద్రమంత్రి బలరాంనాయక్ చేతుల మీదుగా ఓ పైలాన్‌ను ఆవిష్కరించారు. దానిపై కంచుతో తయారు చేసిన కాకతీయ రాజుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇప్పుడది శిథిలావస్థకు చేరుకుని కళా విహీనంగా మారింది. పైలాన్ చుట్టూ అమర్చిన బొమ్మలు ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి. గద్దె చుట్టూ ఏర్పాటు చేసిన గ్రానైట్ రాయి పూర్తిగా ధ్వంసం అయింది. నిత్యం ఆహ్లాదం కోసం వడ్డేపల్లి కట్టపైకి వచ్చే పర్యాటకులను శిథిలంగా మారిన పైలాన్ వెక్కిరిస్తోంది. అధికారులు స్పందించి పైలాన్‌కు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.
కళావిహీనంగా దర్శనం
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment