సీనియర్లను విస్మరించడం సరికాదు
ఖిలా వరంగల్: 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియశీలక కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన లాంటి సీనియర్లను పార్టీ విస్మరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరాటే ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు నివసించే భూపేష్‌నగర్‌కు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈమేరకు వరంగల్ ఫోర్ట్ రోడ్డు భూపేష్‌నగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్లకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కమిటీలో స్థానం కల్పించకపోవడం బాధాకరమని వాపోయారు. అజీర, అరుణ, అంజమ్మ, సంతోషిని, స్వరూప, కొయ్యాడ ఉమ, రమ, మస్తాన్, వెంకట్, రమేష్, రాజేశ్వర్, ఆడెపు రాజేందర్ పాల్గొన్నారు.
సీపీని కలిసిన ఎస్సై
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని పరకాల డివిజన్ శాయంపేట పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్ గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి మొక్క అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment