టీపీసీసీ లీగల్ సెల్
జిల్లా చైర్మన్‌గా శ్రీనివాసన్
వరంగల్ లీగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హనుమకొండ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా దాయం శ్రీనివాసన్, కన్వీనర్‌గా సిద్దం యుగేందర్‌ను నియమిస్తూ టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జిల్లా లీగల్ సెల్ నూతన బాధ్యులను కూడా ఆయన నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా సీహెచ్.రవికుమార్, ఎన్‌వీ రమణారెడ్డి, ఎం.ముకుందరావు, ఎస్‌కే హబీబుద్దీన్ అలీ అహ్మద్, పోశిని రవీందర్, జాయింట్ కన్వీనర్లుగా రమేశ్ నాయక్, కొండపాక కృష్ణ, ఎండీ అజర్ పాషా, కృష్ణారావు, గడ్డం విష్ణువర్ధన్, స్పోక్స్ పర్సన్‌గా పి.వరప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమకు అవకాశం కల్పించినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర లీగల్‌సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు..
Comments
Please login to add a commentAdd a comment