‘కమిటీ హాల్’ ప్రకటనను స్వాగతిస్తున్నాం
వరంగల్: ఆజంజాహి మిల్లు కార్మిక భవన్‌కు చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన ప్రకటనను బీజేపీ తరఫున స్వాగతిస్తున్నామని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నిధులు మంజూరు చేయించి వెంటనే నిర్మాణానికి శిలాఫలకం వేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు డిమాండ్ చేశారు. గురువారం ఓసిటీలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ వ్యాపారవేత్త మాల్ నిర్మించేందుకు జరిగిన శంకుస్థాపనలో పాల్గొన్న కొండా మురళి కార్మికుల స్థలం అని తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిపోతారని అధికారులు మాత్రం ఉంటారని, అక్రమం జరిగితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్న విషయాలను గు ర్తుపెట్టుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అనుమతిచ్చిన భవనాలను హైడ్రాతో కూల్చేస్తుంటే వరంగల్‌లో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకునే పనిలో కాంగ్రెస్ నాయకులు పడ్డారని ఆరోపించారు. ఇప్పటికై నా షాపింగ్ మాల్ నిర్మాణంపై వెల్లువెత్తిన నిరసనలతో వెనక్కి తగ్గడం అభినందనీయమన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ‘కొండా’
శిలాఫలకం వేయాలి
బీజేపీ నేతల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment