రుద్రేశ్వరస్వామికి నాగాభరణం బహూకరణ
హన్మకొండ కల్చరల్: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జీఎమ్‌ఆర్ గ్రూప్స్ ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ బొమ్మిడాల శ్రీనివాస్, వరలక్ష్మి దంపతులు రుద్రేశ్వరస్వామికి వెండి నాగాభరణం బహూకరించారు. రూ.10.20 లక్షల విలువైన 10 కేజీల వెండి ఉపయోగించి ఐదు నాగముఖాలతో తయారు చేయించిన వెండి ఆభరణాన్ని గురువారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఆలయ ఈఓ వెంకటయ్య, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మకు అందజేశారు. ఈసందర్భంగా వేదపండితులు గంగాధర ఫణి భూషణశర్మ, వినోద్‌శర్మ ఆధ్వర్యంలో ఆభరణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 21 సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment