సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
వరంగల్ క్రైం: ప్రైవేట్ హాస్టళ్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రైవేట్ హాస్టళ్ల యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ల యజమానులతో భీమారంలోని శుభం కల్యాణ వేదికలో సీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా హాస్టల్ యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలపై సీపీ పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. హాస్టల్‌కు వచ్చి పోయే వారి వివరాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలని, అలాగే హాస్టల్‌లో ఉండే వారి దినచర్యపై దృష్టి పెట్టాలని, రాత్రి సమయాల్లో వారిని బయటికి వె ళ్లేందుకు అనుమతించవద్దని సూచించారు. హాస్టళ్లలో ఉండే వారి కోసం వచ్చే వారి నుంచి సమాచా రం తీసుకోవాలని, స్థానిక పోలీసుల సహకారం తీ సుకుని యాజమాన్యం ఈనెల 31లోగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి నుంచి హాస్టళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టనున్నట్లు, సూచనలు పాటించని హాస్టళ్లపై చర్యలుంటాయని సీపీ తెలి పారు. కార్యక్రమంలో ఏఎస్పీ భట్, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు సతీశ్, రవికుమార్ పాల్గొన్నారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా
ప్రైవేట్ హాస్టళ్ల యజమానులకు
అవగాహన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment