కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలి
48 గంటల నిరసన.. శిబిరంలోనే రాత్రినిద్ర
ఎంజీఎం: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఏఎన్‌ఎంలను రాత పరీక్ష లేకుండానే రె గ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి కె.యాదనాయక్ డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంలు చేపట్టిన 48 గంటల నిరసన లో ఆయన మాట్లాడారు. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు 24 ఏళ్ల నుంచి రెగ్యులర్ కాకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మె సందర్భంగా ఏఎన్‌ఎంల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ కమిటీ రిపోర్ట్ లేకుండా రాత పరీక్ష తేదీ ప్రకటించడం వెనుకాల ఉన్న అంతర్యమేంటని ప్రశ్నించారు. రాత పరీక్షను వాయిదా వేయకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కాగా, శిబిరంలోనే రాత్రి నిద్ర చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జే.సుధాకర్, సుజాత, సరోజ, చంద్రకళ, ప్రభావతి, సాంబలక్ష్మి, మంజుల, పుష్పలత, విజయ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment