కార్మిక భవన్ స్థలంలో కమిటీ హాల్
వరంగల్: ఆజంజాహి మిల్లుకు చెందిన కార్మిక భవన్ స్థలంలో కార్మికుల కమిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇప్పటి వరకు కబ్జాలకు పాల్పడలేదన్నారు. గురువారం ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారి ఓంనమశ్శివాయ తనకు ఫోన్ చేసి ‘వరంగల్‌లో భారీ మాల్ నిర్మిస్తున్నా.. అందులో 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఆ నిర్మాణానికి జరిగే శంకుస్థాపనలో పాల్గొనాలి’ అని తనను ఆహ్వానించారని.. అందుకే శంకుస్థాపనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో టెంట్ వేసి ఉండడం గమనించానని, ఆతర్వాత అసలు విషయం తెలిసిందన్నారు. గవర్నమెంట్ స్థలం అని రెవెన్యూ శాఖ ధ్రువీకరిస్తే అదే 12 గుంటల భూమిలో కార్మికులకు కమిటీ హాల్‌ను నిర్మించి ఇస్తామన్నారు. కాగా.. తాను ఎప్పుడూ ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. కొండా మురళి కబ్జా చేశారని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నవీన్‌రాజ్, మిల్లు కార్మికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నా 40 ఏళ్ల రాజకీయంలో
కబ్జాలకు పాల్పడలేదు
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment