కార్మికులకు అండగా బీఆర్‌ఎస్
ఖిలా వరంగల్: ఆజంజాహి మిల్లు కార్మికుల భవన విషయంపై కొంతమంది వ్యక్తిగతంగా తనపై బుర ద చల్లడం సరికాదని, కార్మికులకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేలుపెడితే కొరకని, వెన్న పెడితే తినని అమాయకులు భూమిపూజలో పాల్గొన్నారా? దీన్ని కార్మికులు గమనిస్తున్నారని అన్నారు. ఏడాదిగా కబ్జాలకు పాల్పడుతుంది ఎవరో సమాజానికి తెలుసన్నారు. రెండు రోజులుగా ఆజంజాహి మిల్లు స్థలం పుష్ప–2 సినిమా నడుస్తుందని, దీనిపై మాజీ ఎమ్మెల్సీ స్పష్టత లేకుండా మాట్లాడడం, అన్నీ తెలిసి నాకేం తెలియదు అనేతీరుగా ఉండడం సిగ్గు చేటుగా ఉందన్నారు. ఆజంజాహి మిల్లు స్థలంలో కార్మికులకు ఎలాంటి చిన్న మోసం జరిగినా వారిపక్షాన నిలబడి పోరాడుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి కబ్జాకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, టి.రమేష్‌బాబు, రాజేందర్, మోహన్, గోరంట్ల మనోహర్, సింగిరెడ్డి యశోద తదితరులు పాల్గొన్నారు.
బురద చల్లడం సరికాదు..
కబ్జాలకు పాల్పడేది ఎవరు?
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
Comments
Please login to add a commentAdd a comment