ఏసు మార్గంలో మానవాళికి రక్షణ
కాజీపేట రూరల్: ఏసుక్రీస్తు మార్గంలో ప్రపంచ మానవాళికి రక్షణ సమాధానం, ప్రేమ, సంతోషమని, క్రీస్తు చెప్పిన మాటలు నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యమనే మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట బాపూజీనగర్ మెయిన్‌రోడ్డులోని సిద్దు టెంట్‌హౌస్ వద్ద బీఆర్‌ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మినీ క్రిస్మస్ వేడుకలను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేష్, శిరుమల్ల దశరథం, గబ్బెట కరణ్, దువ్వ కనకరాజ్, పాలడుగుల శివకుమార్, సుంచు కృష్ణ, కాటపురం రాజు, పాలడుగుల రామస్వామి, సుంచు అశోక్, ఎండీ.హుస్సేన్, దువ్వ నరేష్, బొల్లికొండ యాదగిరి, సోని, మహమూద్, ఇమ్మడి రవి, సిరిపాక కుమార్, నయీంజుబేర్, చందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment