మార్కెట్‌లో తూకాలపై అవగాహన
వరంగల్: వినియోగదారుల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఏనుమాముల వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో రెండో రోజు గురువారం మార్కెట్‌లోని రైతులు, అధికారులకు లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 – సవరణలపై అవగాహన కల్పించినట్లు వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. తూనికలు, కొలతలపై తప్పనిసరిగా లీగల్ మెట్రాలజీ శాఖ స్టాంపింగ్ ఉండాలని అన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పీఓఎస్ మిషన్లతో పాటు మిరప, పత్తి తూకాల్లో లీగల్ మెట్రాలజీ ఆమోదం ఉన్న మాయిశ్చరైజర్ మిషన్లు తప్పనిసరిగా ఉండాలని మార్కెట్ అధికారులకు మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి సూచించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్, వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ –2 కార్యదర్శి డి.అంజిత్‌రావు, హైకోర్టు అడ్వకేట్ మురారి యశ్వంత్ కుమార్, మండలి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రావుల రంజిత్ కుమార్, చిలువేరు ప్రవీణ్, అసిస్టెంట్ సెక్రటరీ రాజేందర్, సూపర్‌వైజర్లు జి.గంగాధర్, మురళి పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ అధికారులతో కలిసి తూకం యంత్రాలను వినియోగదారుల మండలి ప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) పోస్టర్‌ను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment