విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ
హసన్‌పర్తి: హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ హసన్‌పర్తి ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ బుక్స్‌ను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భగా లయన్స్ క్లబ్ జనగామ కోఆర్డినేటర్ హరికిన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని సూచించారు. పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హసన్‌పర్తి అధ్యక్షుడు కృపాకర్, కార్యదర్శి ఎన్.కుమారస్వామి, కోశాధికారి శేఖర్, సభ్యులు సంపత్, సుధీర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వరంగల్ శివనగర్‌లో..
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు సిన్సినాటి మిత్ర బృందం ప్రతినిధులు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పూస నరేంద్రస్వామి, తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రంగాచారి, కవిత, అంజయ్య, సుజాత, ధనలక్ష్మి, సుహాసిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment