భవన నిర్మాణ పనులు నిలిపివేయాలి
వరంగల్ అర్బన్: వరంగల్ ఓసిటీ సమీపంలోని ఆజంజాహి మిల్లు యూనియన్ భవన్ స్థలంలో కొత్తగా భవన నిర్మాణ పనులు చేపట్టకుండా నిలిపివేయాలని బీజేపీ వరంగల్ జిల్లా కమిటీ, ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను గురువారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన స్థలంలో 1959, నవంబరు 3న ఆజంజాహి మిల్లు వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణం కోసం అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. వరంగల్‌కు చెందిన ఓ బడా వ్యాపారి షాపింగ్ క్లాంపెక్స్ కోసం అధికారులు అనుమతి ఇవ్వడం సరికాదని ఆక్షేపించారు. వినతిపత్రాలు ఇచ్చిన వారిలో బీజేపీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, బాకం హరిశంకర్, కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, చాడ స్వాతి, రావుల కోమల, బైరి లక్ష్మి, జలగం అనిత, మునిగాల సరోజన, గందె కల్పన, గుజ్జుల వసంత, కార్మిక ప్రజాసంఘాల నాయకులు సింగారపు బాబు, నలిగంటి రత్నమాల, పనాస ప్రసాద్, జగదీశ్వర్, సుమన్, కోటేశ్వర్, రమాదేవి, గంగుల దయాకర్, శ్రీనివాస్, నగేష్ ఉన్నారు.
బల్దియా కమిషనర్‌కు బీజేపీ,
ప్రజా, కార్మిక సంఘాల వినతులు
Comments
Please login to add a commentAdd a comment