కాజీపేటలో అగ్ని ప్రమాదాలపై ప్రదర్శన
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో హనుమకొండ అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిమాపక ప్రదర్శన గురువారం జరిగింది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎల్.దయాకర్, రైల్వే సీనియర్ డీఎంఈ ఎన్‌వీ.వెంకటకుమార్ పర్యవేక్షణలో ప్రదర్శనలు జరిగాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడకంపై జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గృహ విద్యుత్ పరికరాల ఫైర్ యాక్సిడెంట్ల గురించి వివరించి వాటి నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఎంఈ అనికేత్ ఖడ్గే, ఏడీఎంఈ భానుప్రకాష్, జనరల్ ఎస్‌ఎస్‌ఈ శ్రీనివాస్‌నాయక్, ఎల్‌ఎఫ్ రాజశేఖర్, ఈఎఫ్ రమేష్‌కుమార్, ఫైర్ స్టాప్ ఎండీ.యాకూబ్, గౌతమ్ ముని, డి.రాజాకుమార్, జి.వంశీ, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రామారావు, ఆల్ ఇంజినీర్స్, కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment